Header Banner

మహిళలకు శుభవార్త.. ఆ కారణంతో భారీగా దిగొస్తున్న బంగారం ధర.. నిపుణులేమంటున్నారు?

  Thu May 01, 2025 20:40        Business

ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా గురువారం ఒక్కరోజే పసిడి ధరల్లో భారీ పతనం నమోదైంది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,180 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.95,730 వద్ద కొనసాగుతోంది. గత పది రోజుల వ్యవధిలో చూసుకుంటే, బంగారం ధర దాదాపు రూ.5,000 వరకు దిగిరావడం గమనార్హం. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు సంకేతాలు వెలువడటం వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపాయని వారు పేర్కొంటున్నారు. దీనికి తోడు డాలర్ విలువ బలపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి గిరాకీ తగ్గిందని, ఫలితంగా వరుసగా రెండో రోజు ధరలు తగ్గాయని వివరిస్తున్నారు. త్వరలో వెలువడనున్న అమెరికా ఆర్థిక గణాంకాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai